రిలయన్స్ జియో టీవీలో వింటర్ ఒలింపిక్స్

రిలయన్స్ జియో టీవీలో వింటర్ ఒలింపిక్స్

  ముంబయి: రిలయన్స్ జియో టీవీ యాప్ జియోటీవీలో శుక్రవారం నుంచి దక్షిణ కొరియాలోని ప్యాంగ్‌చాంగ్‌లో ఆరంభమ్యే వింటర్ ఒలింపిక్స్‌ను క్రీడాభిమానుల కోసం ప్రత్యక్ష ప్రసారం చేయనుంది. భారత్‌లో ఈ ఒలింపిక్స్‌కు సంబంధించిన డిజిటల్ ప్రసార హక్కులను జియో టీవీ దక్కించుకుంది. దీంతో పాటు ఐఓసీ తన అధికారిక వెబ్‌సైట్.. ఒలింపిక్ ఛానెల్, యూట్యూబ్ ఛానెల్‌లో కూడా క్రీడలను చూడొచ్చు. ఈ క్రీడలు ఈనెల 25వరకు జరగనున్నాయి.

భారత్ తరఫున ఇద్దరే..
ఈ క్రీడల్లో భారత్ నుంచి శివ్‌కేశవన్, జగదీశ్ మాత్రమే పాల్గొంటున్నారు. క్రాస్ కంట్రీ స్కీయింగ్‌లో జగదీశ్, లుజ్‌లో కేశవన్ సత్తా చాటేందుకు సిద్ధమయ్యారు.