130 అమెరికన్ సంస్థలకు నెలవు

 130 అమెరికన్ సంస్థలకు నెలవు

 భారత్‌లో బహుళజాతి సంస్థల వ్యాపార విస్తరణలో హైదరాబాద్‌కున్న క్రేజ్ అంతా.. ఇంతా కాదు. ముఖ్యంగా అమెరికా సంస్థల చూపంతా కూడా భాగ్యనగరం వైపే. ఇక్కడ 130 అమెరికన్ కంపెనీలుండగా, మైక్రోసాఫ్ట్, గూగుల్, అమెజాన్, ఫేస్‌బుక్, ఆపిల్, ఉబర్, క్వాల్‌కమ్ వంటి దిగ్గజాలకూ ప్రధాన కేంద్రాలున్నాయి. రాబోయే రోజుల్లో ఇంకా చాలా అమెరికా సంస్థలు హైదరాబాద్‌లో కార్యాలయాలను ఏర్పాటు చేస్తాయని ఇండో-అమెరికన్ చాంబర్ ఆఫ్ కామర్స్ (ఐఏసీసీ) తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ చాప్టర్ చైర్మన్ శ్రీకాంత్ బాడిగ అంచనా వేశారు. ఇక హైదరాబాద్‌లోని దేశీయ దిగ్గజ సంస్థల విషయానికొస్తే.. ఆ జాబితా చాంతాడంత ఉంటుంది.1990వ దశకం నుంచే ప్రపంచ ఐటీ పటంలో హైదరాబాద్ విశిష్ఠ స్థానాన్ని దక్కించుకుంది.