33వేల చేరువలో పసిడి

33వేల చేరువలో పసిడి

 న్యూఢిల్లీ : దేశంలో పెళ్లిళ్ల సీజన్‌ దగ్గర పడుతున్న నేపథ్యంలో బంగారానికి డిమాండ్‌ పెరుగుతోంది. దీంతో ముందు జాగ్రత్తగా అభరణాల వర్తకులు కొనుగోళ్లకు మొగ్గు చూపడంతో వరుసగా మూడు సెషన్‌లోనూ పసిడి ధర పెరిగి రూ.33వేల చేరువలో నమోదయ్యింది. పారిశ్రామిక వర్గాలు వెండి కొనుగోళ్లకు మొగ్గు చూపడంతో కిలో లోహం ధర రూ.40వేలకు చేరింది. బుధవారం న్యూఢిల్లీ బులియన్‌ మార్కెట్‌లో 99.9 శాతం, 99.5 శాతం స్వచ్ఛత కలిగిన 10 గ్రాముల బంగారంపై రూ.110 పెరిగి వరుసగా రూ.32,800, రూ.32,650కి ఎగిసింది. రెండు సెషన్లలో బంగారం ధర రూ.190 పెరిగింది. గ్లోబల్‌గా న్యూయార్క్‌లో ఒక్క ఔన్స్‌ పసిడి 0.26 శాతం తగ్గి 1,283.20 నమోదయ్యింది. కిలో వెండిపై రూ.300 ప్రియమై రూ.40,100గా పలికింది. 100 వెండి నాణేలపై రూ.1000 ప్రియమై రూ.77,000గా నమోదయ్యింది.