అవాంఛిత కాల్స్ నియంత్రణకు యాప్

అవాంఛిత కాల్స్ నియంత్రణకు యాప్

  హైదరాబాద్ : అవాంఛిత ఫోన్ కాల్స్ నుంచి ఇబ్బందులు తొలగించేందుకు మ్యూచువల్ కాలర్ పేరుతో కొత్త సౌలభ్యాన్ని తీసుకువచ్చినట్లు హైదరాబాద్‌కు చెందిన ఎంటైర్ యాప్ సంస్థ తెలిపింది. అవాంఛిత కాల్స్ వల్ల మహిళలు, ఉద్యోగులు ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో తాము ఈ ఆవిష్కరణ తీసుకువచ్చినట్లు సంస్థ వ్యవస్థాపకుడు సాంబశివరావు తెలిపారు. తమ సన్నిహితుల ఫోన్‌లలో నిక్షిప్తం అయిన ఫోన్ నంబర్లను ఆకుపచ్చ రంగులో, అపరిచితుల నంబర్లను ముదురు గోధుమవర్ణంలో ప్రదర్శిస్తుందని తద్వారా సంబంధిత కాల్స్‌కు స్పందించడం వినియోగదారుడి స్వేచ్ఛ అని పేర్కొన్నారు.