ఆడియో బుక్ సర్వీస్‌ను లాంచ్ చేసిన అమెజాన్

ఆడియో బుక్ సర్వీస్‌ను లాంచ్ చేసిన అమెజాన్

  భారత్‌లోని పుస్తక ప్రియుల కోసం అమెజాన్ ఆడిబుల్ పేరిట ఆడియో బుక్ సర్వీస్‌ను తాజాగా ప్రారంభించింది. ఆడిబుల్ యాప్ ద్వారా పుస్తక ప్రియులు తమకు నచ్చిన పుస్తకాలను ఆడియో ఫార్మాట్‌లో వినవచ్చు. ప్రస్తుతం ఈ యాప్‌లో 2 లక్షలకు పైగా ఆడియోబుక్స్ కస్టమర్లకు లభిస్తున్నాయని అమెజాన్ తెలిపింది. ఆడిబుల్ యాప్‌లో సబ్‌స్క్రిప్షన్‌కు గాను నెలకు రూ.199 చెల్లించాల్సి ఉంటుంది. దీంతో యాప్‌లో ఎన్ని పుస్తకాలనైనా యూజర్లు పొందవచ్చు.మొదటి సారిగా యాప్‌ను వినియోగించేవారి కోసం 30 రోజుల ట్రయల్ పీరియడ్‌ను ఉచితంగా అందిస్తున్నారు. ఈ యాప్‌కు గాను 6 నెలల సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌ను ఎంచుకుంటే రూ.1345, 12 నెలల ప్లాన్‌కు రూ.2,332 చెల్లించాల్సి ఉంటుంది. audible.in వెబ్‌సైట్‌ను సందర్శించడం ద్వారా యూజర్లు ఈ యాప్‌లో రిజిస్టర్ చేసుకుని ఆడియో బుక్స్‌ను వినవచ్చు.