బిగ్‌సిలో సంక్రాంతి వినూత్న ఆఫర్లు

బిగ్‌సిలో సంక్రాంతి వినూత్న ఆఫర్లు

  హైదరాబాద్ : సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రముఖ రిటైల్ మొబైల్ సంస్థ బిగ్‌సి వినూత్న ఆఫర్లను ప్రకటించింది. ఈ ఆఫర్లలో భాగంగా ఎంపిక చేసిన మొబైళ్లపై విలువైన బహుమతులతోపాటు సున్న శాతం వడ్డీ, డౌన్‌పేమెంట్‌లు, ప్రాసెసింగ్ ఫీజు వంటి ఆకర్షణీయమైన రుణ సదుపాయాన్ని అందచేస్తున్నామని కంపెనీ ప్రతినిధి ఒకరు తెలిపారు. వీటితోపాటు బజాజ్ ఫైనాన్స్ ద్వారా కొనుగోలు చేసిన ప్రతి మొబైల్‌పై 10 శాతం వరకు క్యాష్‌బ్యాక్, స్మార్ట్‌ఫోన్ కొనుగోలుపై రూ.2,200 వరకు జియో క్యాష్ బ్యాక్, 30 జీబీల డాటాను ఉచితంగా అందిస్తున్నది. ఎంపిక చేయని మొబైళ్లు కొనుగోలు చేసిన వారికి కూడా ఒకసారి స్క్రీన్ రీప్లెస్‌మెంట్ కూడా సంస్థ ఇస్తున్నది. ఇవియే కాక, సామ్‌సంగ్ గెలాక్సీ జే6, జే6 ప్లస్, ఏ7 మొబైళ్ల కొనుగోళ్లపై 10 శాతం క్యాష్‌బ్యాక్, బజాజ్ ఫైనాన్స్ ఈఎంఐ సదుపాయం, టీవీఎస్ క్రెడిట్ సులభంగా ఈఎంఐ లభించనున్నది. ఒప్పో ఎఫ్9 ప్రొ మొబైల్‌పై రైస్‌కుక్కర్, అన్ని వివో మొబైళ్లపై సర్‌ప్రైజ్ గిఫ్ట్, రూ.1,590 విలువైన కార్బన్ కే3 బూమ్ మ్యాక్స్ మొబైల్‌ను రూ.2,500 విలువైన పెడెస్టాల్ ఫ్యాన్‌ను ఉచితంగా అందిస్తున్నది. ప్రతి మొబైల్ కొనుగోలుపై కచ్చితమైన బహుమతి కూడా ఇస్తున్నది సంస్థ.