చాయ్‌గురు నుంచి రోజెల్లా టీ

చాయ్‌గురు నుంచి రోజెల్లా టీ

  హైదరాబాద్ : నిత్యజీవితంలో ఒత్తిడి నుంచి ఉపశమనం కోసం ప్రజలు కోరుకునే చాయ్‌లో వినూత్న అనుభూతిని అందించేందుకుగాను నేచురల్ ఫార్మసీ కొత్త ఉత్పత్తి తీసుకురావడం సంతోషకరమని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. చాయ్‌గురు బ్రాండ్ నుంచి రోజెల్లా టీని రైతు సమన్వయ సమితి కార్పొరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు గుత్తా సుఖేందర్ రెడ్డితో కలిసి శుక్రవారం మార్కెట్లోకి విడుదల చేశారు. నిజామాబాద్ జిల్లాకు చెందిన ప్రవాస భారతీయుడు రామన్ మదాల ఈ టీ పొడిని ఉత్పత్తి చేశారు. ఈ రోజెల్లా టీ పొడిని పుంటికూర జాతికి చెందిన హైబిస్కస్ పుష్పాలు, ఎండబెట్టిన అల్లం, పిప్పళ్లతో తయారు చేసినట్లు రామన్ చెప్పారు. ఈ టీ తాగడం వల్ల శరీరానికి విట్‌మిన్ సీ, యాంటీ ఆక్సిడెంట్లు సంవృద్ధిగా లభిస్తాయని చెప్పారు. దీనిని వేడినీళ్ళు, చల్లటి నీళ్లు, సోడాతో సేవించవచ్చని చెప్పారు.