చెన్నైలో పల్సస్ కేంద్రం ప్రారంభం

చెన్నైలో పల్సస్ కేంద్రం ప్రారంభం

  న్యూఢిల్లీ :  రాష్ట్రనికి చెందిన ప్రముఖ పరిశోధనల సంస్థ పల్సస్ వ్యాపారాన్ని శరవేగంగా విస్తరిస్తున్నది. ఇప్పటికే గుర్‌గావ్‌లో సెంటర్‌ను ప్రారంభించిన సంస్థ.. తాజాగా శుక్రవారం చెన్నై సెజ్‌లో ఏర్పాటు చేసిన సెంటర్‌ను కేంద్ర వాణిజ్య మంత్రి సురేశ్ ప్రభు న్యూఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..పల్సస్ తనదైన వ్యాపారంలో దూసుకుపోతున్నదన్నారు. హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన సెంటర్‌లో 5 వేల మంది సిబ్బంది విధులు నిర్వహిస్తుండగా, నూతనంగా ఏర్పాటు చేసిన ఈ రెండు సెంటర్లలో మరో 2 వేల మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయని కంపెనీ వ్యవస్థాపకుడు, సీఈవో శ్రీనుబాబు గేదెల ఈ సందర్భంగా తెలిపారు.