కన్సూమర్‌ ప్రొడక్ట్స్‌లోకి హీరో..

కన్సూమర్‌ ప్రొడక్ట్స్‌లోకి హీరో..

 న్యూఢిల్లీ : హీరో గ్రూపునకు చెందిన ఎలక్ట్రానిక్స్‌, టెక్నలాజీ ఉత్పత్తుల సంస్థ హీరో ఎలక్ట్రానిక్స్‌ తాజాగా కన్సూమర్‌ ప్రొడక్ట్స్‌ సెగ్మెంట్‌లోకి ప్రవేశిస్తున్నట్లు వెల్లడించింది. ఈ సెగ్మెంట్‌లో వచ్చే ఐదేళ్లలో ఆర్టిఫిషియల్‌ ఇంటి లిజెన్సీ (ఎఐ) ఆధారిత 10 ఉత్పత్తులను ఆవిష్క రించనున్నట్లు హీరో ఎలక్ట్రానిక్స్‌ ఫౌండర్‌, డైరెక్టర్‌ ఉజ్జ్వల్‌ ముంజల్‌ తెలిపారు. ఇందులో హోమ్‌ ఆటోమేషన్‌, ఆటోమోటివ్‌, వైద్య, ఎంటర్‌టైన్‌మెంట్‌ డొమైన్లకు సంబం ధించిన ఉత్పత్తులు ఉంటాయన్నారు. లాస్‌వేగస్‌ లో (కన్సూమర్‌ ఎలక్ట్రానిక్‌ షో) సెస్‌ 2019లో ప్రదర్శిస్తున్నట్లు తెలిపారు. గ్లోబల్‌ టెక్నలాజీ సంస్థలు అమెజాన్‌, క్వాల్‌కోమ్‌ల భాగస్వా మ్యంతో వీటిని అందుబాటులోకి తెస్తున్నామన్నారు.