ఈ ఏడాది పెరిగిన చైనా వాణిజ్యం

ఈ ఏడాది పెరిగిన చైనా వాణిజ్యం

   బీజింగ్‌ : ఈ ఏడాది జనవరి, నవంబరు మధ్య నాటికి చైనా మొత్తం వాణిజ్యం గతేడాది వాణిజ్య స్థాయిని అధిగమించిందని కస్టమ్స్‌ డేటా పేర్కొంది. అయితే, కస్టమ్స్‌ విభాగం గణాంకాలు వివరంగా ఇవ్వనప్పటికీ గతేడాది ఇదే కాలంతో పోల్చుకుంటే దాదాపు 15శాతం అధికంగా వాణిజ్యం ఈ ఏడాది నమోదైందని తెలిపింది. 2017లో దేశ మొత్తం విదేశీ వాణిజ్యం 27.79 ట్రిలియన్ల యువాన్లుగా నమోదైంది. ఇది 2016 నాటికన్నా 14.2శాతం ఎక్కువ. అక్టోబరులో విదేశీ అనిశ్చితులు పెరిగినప్పటికీ ఎగుమతులు, దిగుమతుల పరంగా అనూహ్యమైన రీతిలో పటిష్టమైన వృద్ధి నమోదైంది. ఈ ఏడాది మొదటి 10మాసాల్లో విదేశీ వాణిజ్యం 25.05 ట్రిలియన్ల యువాన్లుగా వుంది. అంటే గతేడాది ఇదే కాలంతో పోలిస్తే 11.3శాతం ఎక్కువ.