ఇక నుంచి పతంజలి పాలు.. నీళ్లు

ఇక నుంచి పతంజలి పాలు.. నీళ్లు

 న్యూఢిల్లీ : దేశీ ఉత్పత్తులను మార్కెట్‌లోకి తీసుకొచ్చి ప్రముఖ రిటైల్‌ స్లోర్లకు గట్టి పోటీ ఇస్తున్న బాబా రామ్‌దేవ్‌ తన పతంజలి నుంచి మరో ఐదు ఉత్పత్తులను మార్కెట్‌లోకి తేనున్నట్లు ప్రకటించింది. సమర్థ భారత్‌.. స్వస్థ భారత్‌ మిషన్‌లో భాగంగా పాలు, పాల ఉత్పత్తులు, నిల్వ చేయడానికి వీలున్న కూరగాయాలు, సోలార్‌ ఉత్పత్తులు, డ్రింకింగ్‌ వాటర్‌, పశువుల మేతకు సంబంధించిన ఉత్పత్తులను మార్కెట్‌లోకి తీసుకురానున్నట్లు బాబా రాందేవ్‌ తన ట్విటర్‌లో ప్రకటించారు. అంతేకాక  2020 ఆర్థిక సంవత్సరానికి గాను దాదాపు 1000 కోట్ల రూపాయల అమ్మకాలు లక్ష్యంగా ఈ ఉత్పత్తులను తీసుకోస్తున్నట్లు బాబా రామ్‌దేవ్‌ తెలిపారు. దీని ద్వారా మరో 20 వేల మందికి ఉపాధి కల్పించనున్నట్లు ప్రకటించారు.