ఇక ట్విట్టర్ పెద్ద డిస్‌ప్లేలు

ఇక ట్విట్టర్ పెద్ద డిస్‌ప్లేలు

 న్యూయార్క్: వినియోగదారుల సౌకర్యార్థం గత వారం ట్వీట్ పరిమితిని 140 అక్షరాల నుంచి 280కి పెంచిన ట్విట్టర్.. తాజాగా డిస్‌ప్లే పేర్లలో అక్షరాల సంఖ్యను 20 నుంచి 50కి పెంచుతున్నట్లు ప్రకటించింది. ఇక నుంచి పొడుగులో మీ ట్విట్టర్ డిస్‌ప్లే పేరు 50 అక్షరాల వరకు ఉంచుకోవచ్చు. మీ మధ్య పేరు లేదా మరికొన్ని ఎమోజీలను చేర్చుకోండి అని ఈ ప్రముఖ సోషల్ నెట్‌వర్క్ సంస్థ స్పష్టం చేసింది. ఇక ప్రైవసీ మెనూలతోపాటు, సెట్టింగ్‌ల ద్వారా తమ యూజర్ పేర్లనూ మార్చుకునే వెసులుబాటును నెటిజన్లకు కల్పించిన ట్విట్టర్.. ఇంతకుముందున్నట్లుగానే యూజర్ నేమ్ అక్షరాలు 15కు మించరాదంది. కాగా, హిందీలో ట్వీట్ చేసేవారికీ 280 అక్షరాల వరకు అవకాశాన్నిచ్చింది.