ఐఫోన్లపై భారీ తగ్గింపు

ఐఫోన్లపై భారీ తగ్గింపు

 2018 కొత్త ఐఫోన్‌ మోడల్స్‌... ఐఫోన్‌ 10ఎస్‌, ఐఫోన్‌ 10ఎస్‌ మ్యాక్స్‌, ఐఫోన్‌ ఎక్స్‌ఆర్‌ లాంచింగ్‌ సందర్భంగా, పాత ఐఫోన్‌ వేరియంట్లపై భారీగా ధరలు తగ్గించింది ఆపిల్‌. దేశీయ మార్కెట్‌లోనూ, గ్లోబల్‌గా కూడా వీటి ధరలు తగ్గాయి. దేశీయ మార్కెట్‌లో ఆపిల్‌ ఐఫోన్‌ 6ఎస్‌ 32జీబీ వేరియంట్‌ ధర రూ.29,900కే లభ్యమవుతుంది. ఐఫోన్‌ 6ఎస్‌ ప్లస్‌ బేస్‌ వేరియంట్‌ ధర కూడా 34,900 రూపాయల నుంచి ప్రారంభమవుతుంది. ఐఫోన్‌ కొత్త ధరలను ఆపిల్‌ తన వెబ్‌సైట్‌లో అప్‌డేట్‌ చేసింది. అయితే ఐఫోన్‌ 6ఎస్‌, ఐఫోన్‌ 6ఎస్‌ ప్లస్‌, ఐఫోన్‌ 10 లను అమెరికాలో నిలిపివేస్తున్నట్టు పేర్కొంది. కానీ భారత్‌లో కేవలం ఐఫోన్‌ ఎస్‌ఈ నే నిలిపివేసింది. మిగతా మూడు ఐఫోన్లను తక్కువ ధరలకు అందుబాటులోకి తెచ్చింది.