>

ఐఫోన్లపై పేటీఎం భారీ డిస్కౌంట్

ఐఫోన్లపై పేటీఎం భారీ డిస్కౌంట్

  దేశమంతటిన్నీ ఒకే పన్ను విధానంలోకి తీసుకొచ్చే జీఎస్టీ అమలుకు ఇంకా 15 రోజులే మిగిలిఉంది. ఈ లోపల పాత స్టాక్ న్నంతటిన్నీ విక్రయించుకోవడం కోసం రిటైలర్లకు ప్రముఖ పేమెంట్ యాప్ పేటీఎం ప్రీ-జీఎస్టీ క్లియరెన్స్ సేల్ ను ప్రారంభించిన సంగతి తెలిసిందే. నేటితో ముగియనున్న ఈ సేల్ లో ఐఫోన్లపై భారీ డిస్కౌంట్లను ప్రకటించింది. ఐఫోన్ 7(128జీబీ, జెట్ బ్లాక్ కలర్) పై 24 శాతం డిస్కౌంట్ ను పేటీఎం ఆఫర్ చేస్తోంది. దీంతో 70వేల రూపాయలుగా ఉన్న ఈ ఐఫోన్ 53,333కే అందుబాటులో ఉంది. దాంతో పాటు 32జీబీ ఐఫోన్ 7ను 46,182 రూపాయలకే విక్రయిస్తోంది. కాగ, ఈ ఫోన్ ఒరిజినల్ ధర 60వేల రూపాయలు.

 

ఐఫోన్ 6ఎస్ 32జీబీ ఫోన్ ను కూడా కొనుగోలు దారుల కోసం 36,666రూపాయలకు, ఐఫోన్ 6ను 27,285 రూపాయలకు అందుబాటులో ఉంచింది. ఈ డిస్కౌంట్లతో పాటు ఐఫోన్ 7 ప్లస్ స్మార్ట్ ఫోన్ పై 7000 రూపాయల క్యాష్‌ బ్యాక్, ఐఫోన్ 7 ప్లస్ 256జీబీ స్మార్ట్ ఫోన్ పై 10వేల రూపాయల క్యాష్ బ్యాక్ ను పేటీఎం అందిస్తోంది. ఆపిల్ ఐఫోన్ 7 రెడ్ కలర్ ఒరిజినల్ స్మార్ట్ ఫోన్ ధర 80వేల రూపాయలైతే, ఈ ఫోన్ ను కూడా 70,999రూపాయలకే విక్రయిస్తోంది. వీటితో పాటు లెనోవో ల్యాప్ టాప్ పై 20వేల రూపాయల క్యాష్ బ్యాక్, ఏసీలు, రిఫ్రిజిరేటర్లు, టెలివిజన్లపై 10వేల రూపాయల డిస్కౌంట్ ను, ఎల్ఈడీ టీవీలపై 20వేల తగ్గింపును  పేటీఎం ఆఫర్ చేస్తోంది. 


Loading...