ఐటీ సంస్థలకు సర్వీస్ టాక్స్ షాక్

ఐటీ సంస్థలకు సర్వీస్ టాక్స్ షాక్

ఢిల్లీ: దేశంలోని ఐటీ, ఐటీ ఆధారిత సేవల కంపెనీలకు సర్వీస్ టాక్స్ షాక్ తగిలింది. కంపెనీలు అన్ని కలిపి మొత్తం పదివేల కోట్ల రూపాయల సర్వీస్ పన్ను చెల్లించాలని పన్నుల శాఖ 200 సంస్థలకు సర్వీస్ టాక్స్ నోటీసులు జారీ చేసింది.

ఇప్పటికే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ రక్షణాత్మక ఆర్థిక విధానాలతో చిన్న కంపెనీలు గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నాయి2012-2016 మధ్య ఐదేళ్ల కాలంలో విదేశాలకు సాఫ్ట్‌వేర్‌ను ఎగుమతి చేసి పొందిన ప్రజయోనాల రిటర్న్స్‌ దాఖలు చేయాలని సర్వీస్ పన్నుల శాఖ ఐటీ సంస్థలకు నోటీసులు జారీ చేసింది.

ఆలస్యం చేసినందుకు వడ్డీ, జరిమానాలతో పాటు అదనంగా 15 శాతం సేవా పన్ను చెల్లించాలని నోటీసులో తెలిపింది. ఈ పన్ను గతంలో 15 శాతమే ఉంటే...GST రావడంతో ఇప్పుడది కాస్తా 18 శాతానికి పెరగింది.భారత్‌కు వెలుపల వినియోగదారులకు సాఫ్ట్‌వేర్‌ను అందించడం ఐటీ, ఐటీఈఎస్‌ కంపెనీలకు ఎగుమతి చేసినట్టు కాదు. ఎందుకంటే క్లైంటు ప్రత్యేకమైన వివరాలతో భారత ఐటీ కంపెనీలు ఎలాంటి సాఫ్ట్‌వేర్‌ ఎగుమతి చేయాలో ముందే మెయిల్‌ పంపిస్తారు.

అయితే ఇది అందుబాటులో ఉన్న వస్తువులను విదేశీ వినియోగదారుకు అమ్ముతున్నట్లే అని పన్నుల శాఖ తెలిపింది. కంపెనీలు ట్యాక్స్‌ అప్పిలేట్‌ ట్రైబ్యునల్‌కు వెళ్లినా ఫలితం ఉండదని  అక్కడికి వెళ్లాలన్నా ముందు ఆ మొత్తంలో 10 శాతం చెల్లించాల్సి ఉంటుందని నిపుణులు అంటున్నారు. ఈ ఊహించని పరిణామంతో  కొన్ని కంపెనీలు వేరే దేశాలకు తరలిపోవాలని ఆలోచిస్తున్నట్లు సమాచారం.