జియో దీపావళి బంపర్ ఆఫర్..!

జియో దీపావళి బంపర్ ఆఫర్..!

 దీపావళి పండుగను పురస్కరించుకుని రిలయన్స్ జియో తన వినియోగదారులకు బంపర్ ఆఫర్‌ను ప్రకటించింది. రూ.399 జియో ధన్ ధనా ధన్ ప్లాన్‌ను ఈ నెల 12 నుంచి 18 తేదీల మధ్య రీచార్జి చేసుకున్న వారికి అంతే మొత్తాన్ని క్యాష్‌బ్యాక్ రూపంలో అందిస్తున్నది. మొత్తం రూ.400 విలువ గల 8 వోచర్లను అందిస్తున్నది. ఒక్కో వోచర్ విలువ రూ.50 ఉంటుంది. అయితే ఇలా వచ్చిన వోచర్లను నవంబర్ 15వ తేదీ తరువాతే వినియోగించుకోవాలి. 


జియో అందిస్తున్న రూ.50 వోచర్లలో ఒక వోచర్‌ను ఒకసారి మాత్రమే వాడుకోవచ్చు. అలాగే గరిష్టంగా ఒక రీచార్జికి ఒక వోచర్‌ను మాత్రమే రిడీమ్ చేసుకోవచ్చు. రూ.309 ఆపైన విలువ గల ప్లాన్లు లేదా రూ.91 ఆపైన విలువ గల డేటా యాడాన్ ప్లాన్లను రీచార్జి చేసుకుంటే ఈ వోచర్లను ఉపయోగించుకోవచ్చు. కాగా ఈ నెల 19వ తేదీన దీపావళి సందర్భంగా పలు కొత్త ప్లాన్లను ప్రకటిస్తామని జియో ఒక ప్రకటనలో వెల్లడించింది. జియో యాప్, జియో వెబ్‌సైట్, జియో స్టోర్స్‌లలో దేని ద్వారా రీచార్జి చేయించుకున్నా 8 వోచర్లు యూజర్లకు లభిస్తాయి.