>

జియో ఎఫెక్ట్‌: 70 జీబీ డేటా ఇస్తున్న ఐడియా..!

జియో ఎఫెక్ట్‌: 70 జీబీ డేటా ఇస్తున్న ఐడియా..!

 రిల‌య‌న్స్ జియో ఎప్ప‌టిక‌ప్పుడు ప్ర‌వేశ‌పెడుతున్న ఆఫ‌ర్ల‌ను త‌ట్టుకునేందుకు ఇత‌ర కంపెనీలు కూడా అదే రీతిలో ఆఫ‌ర్ల‌ను ప్ర‌వేశ‌పెట్ట‌క త‌ప్ప‌డం లేదు. ఉన్న క‌స్ట‌మ‌ర్ల‌ను కోల్పోకుండా ఉండాలంటే టెలికాం కంపెనీల‌కు నూత‌న ఆఫ‌ర్ల‌ను క‌చ్చితంగా ఇవ్వాల్సిన ప‌రిస్థితి నెల‌కొంది. ఈ క్ర‌మంలో ఐడియా తాజాగా రూ.396 రీచార్జి ప్యాక్‌ను త‌న ప్రీపెయిడ్ యూజ‌ర్ల కోసం ప్ర‌వేశ‌పెట్టింది. 


ఐడియా ప్ర‌వేశ‌పెట్టిన రూ.396 ప్యాక్‌ను రీచార్జి చేయించుకున్న వారికి 70 రోజుల పాటు రోజుకు 1 జీబీ 3జీ డేటా ఉచితంగా ల‌భిస్తున్న‌ది. దీంతోపాటు ఐడియా టు ఐడియా కాల్స్‌ను అన్‌లిమిటెడ్‌గా చేసుకోవ‌చ్చు. ఇక ఇత‌ర నెట్‌వ‌ర్క్ కాల్స్ అయితే 3000 నిమిషాలు ఉచితంగా వ‌స్తున్నాయి. వీటిని రోజుకు గ‌రిష్టంగా 300 నిమిషాలు, వారానికి గ‌రిష్టంగా 1200 నిమిషాల చొప్పున వాడుకోవ‌చ్చు. ఈ ప్యాక్ వాలిడిటీని ఐడియా 70 రోజులుగా ప్ర‌క‌టించింది.


Loading...