జియోపై ఎయిర్‌టెల్, ఐడియా, వొడాఫోన్ ముప్పేట దాడి..!

జియోపై ఎయిర్‌టెల్, ఐడియా, వొడాఫోన్ ముప్పేట దాడి..!

 టెలికాం సంస్థ జియోపై ఎయిర్‌టెల్, ఐడియా, వొడాఫోన్‌లు ముప్పేట దాడి చేస్తున్నాయి. జియో ఇప్పటికే పలు పాత ప్లాన్లను మార్చి కొత్త ప్లాన్లను రూ.50 శాతం డిస్కౌంట్‌తో అందుబాటులోకి తేవడమే కాకుండా, పలు ఇతర ప్యాక్‌లపై 50 శాతం అదనపు డేటాను అందిస్తున్న విషయం తెలిసిందే. కాగా జియో ప్రవేశపెట్టిన ఈ హ్యాపీ న్యూ ఇయర్ ఆఫర్‌కు ఇతర టెలికాం సంస్థలైన ఎయిర్‌టెల్, ఐడియా, వొడాఫోన్‌లు దాడి ఆరంభించాయి. తాము అందిస్తున్న రెండు రకాల ప్లాన్లలో మరింత డేటా, వాలిడిటీలను ఇప్పుడు తమ తమ కస్టమర్లకు అందిస్తున్నాయి. 


* ఎయిర్‌టెల్‌లో ఉన్న రూ.448 ప్లాన్‌లో ఇప్పటి వరకు 70 రోజులకు గాను రోజుకు 1 జీబీ డేటా చొప్పున మొత్తం 70 జీబీ డేటా అందేది. అయితే ఇప్పుడీ ప్లాన్ వాలిడిటీని 82 రోజులు చేశారు. దీంతో ఇప్పుడు రోజుకు 1జీబీ డేటా చొప్పున 82 జీబీ డేటా ఎయిర్‌టెల్ ప్రీపెయిడ్ కస్టమర్లకు లభిస్తుంది. అలాగే రూ.509 ప్లాన్‌లో ఇది వరకు 84 రోజుల వాలిడిటీ ఉండగా దాన్ని ఇప్పుడు 91 రోజులకు పెంచారు. దీంతో అందులో రోజుకు 1జీబీ డేటా చొప్పున 91 జీబీ డేటా ఇప్పుడు కస్టమర్లకు లభిస్తుంది. 

* వొడాఫోన్‌లో రూ.458 ప్లాన్ గతంలో 70 రోజుల వాలిడిటీని కలిగి ఉండగా అది ఇప్పుడు 84 రోజులు అయింది. డేటా 70 జీబీకి బదులుగా 84 జీబీ వస్తుంది. ఇందులోనే ఉన్న రూ.509 ప్లాన్ వాలిడిటీ గతంలో 84 రోజులు ఉండగా అదిప్పుడు 91 రోజులు అయింది. దీంతో ప్రస్తుతం 91జీబీ డేటా వస్తుంది. 

* ఐడియాలో రూ.449 ప్లాన్ గతంలో 70 రోజుల వాలిడిటీని కలిగి ఉండగా అది ఇప్పుడు 82 రోజులు అయింది. డేటా 70 జీబీకి బదులుగా 82 జీబీ వస్తుంది. ఇందులో ఉన్న రూ.509 ప్లాన్ వాలిడిటీ గతంలో 84 రోజులు ఉండగా అదిప్పుడు 91 రోజులు అయింది. దీంతో ప్రస్తుతం 91జీబీ డేటా వస్తుంది. 

ఇక జియోలో రూ.449, రూ.498 ప్లాన్లు 91 రోజుల వాలిడిటీని కలిగి ఉండగా, వీటిలో కస్టమర్లకు వరుసగా రోజుకు 1జీబీ, 1.5 జీబీ డేటా లభిస్తున్నది.