మార్కెట్‌లోకి అయుర్వేద ‘వాటికా’

మార్కెట్‌లోకి అయుర్వేద ‘వాటికా’

  ప్రముఖ ఎఫ్‌ఎంసిజి కంపెనీ డాబర్‌ ఇండియా లిమిటెడ్‌ కేశ తైల విభాగంలో ఏడు అయుర్వేద వన మూలి కలతో సరికొత్త వాటికా కొబ్బ రి నూనెను అందుబాటులోకి తెచ్చినట్లు ప్రకటించింది. సోమవారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆ కంపెనీ మార్కెటింగ్‌ హెడ్‌ రజత్‌ నందా మాట్లాడుతూ ఇది కేశాల కుదుళ్లకు బలం చేకూర్చి వాటి అందాన్ని మరింత పెంచేందుకు దోహదం చేస్తుందన్నారు. నాలుగు వారాల్లోనే 50 శాతం జుట్టు రాలుటను అరికడుతుంద న్నారు. ఈ ఉత్పాదన 25 మిల్లీలీటర్ల నుంచి 300 ఎంఎల్‌ వరకు లభిస్తుందన్నారు. వీటి ధరలు రూ.10 నుంచి రూ.167గా నిర్ణయించామన్నారు.