మరోసారి ధరలు తగ్గించిన శాంసంగ్‌

మరోసారి ధరలు తగ్గించిన శాంసంగ్‌

 న్యూఢిల్లీ:  ప్రముఖ ఎలక్ట్రానిక్‌ ఉత్పత్తుల సంస్థ శాంసంగ్‌ ఎలక్ట్రానిక్స్  తమ కస్టమర్లకు  అపుడే పండుగ కానుక ఇచ్చేసింది. శాంసంగ్‌ టీవీల రేట్లను మళ్లీ తగ్గిస్తున్నట్టు వెల్లడించింది. తన టాప్‌ సెల్లింగ్‌ మోడల్‌ టీవీలపై  డిస్కౌంట్‌ను ప్రకటించింది. వివిధ మోడళ్ల టీవీలపై 5 నుంచి 15శాతం తగ్గింపు ధరలను ఆఫర్‌ చేస్తోంది.

తాజా నివేదికల ప్రకారం 32-43 అంగుళాల టీవీలపై  వెయ్యి నుంచి రూ .2,500 వరకు  ఈ తగ్గింపు ఉండనుంది. 75 ఇంచెస్‌ టీవీలపై  రూ45వేల రూపాయల దాకా (15 శాతం) తగ్గింపును అందివ్వనుంది. టిసిఎల్, షావోమి బిపిఎల్, వూ, కోడాక్ మార్కెట్‌ ప్రత్యర్థులపోటీని అధిగమించేలా ఈ తగ్గింపు ధరలను వెల్లడించింది.   అంతేకాదు రానున్న పండుగసీజన్‌లో క్యాష్‌బ్యాక్‌లు, ఇతర బహుమతులను వినియోగదారులకు అందించనుందట. కాగా దక్షిణ కొరియా దిగ్గజం  శాంసంగ్‌ దాని టెలివిజన్ సెట్లపై రేట్లు తగ్గించడం వరుసగా ఇది రెండవసారి. ఈ ఏడాది  జూన్‌లో 10-20 శాతం ధరలు తగ్గించింది.