మారుతి కార్ల ధరలకు రెక్కలు

మారుతి కార్ల ధరలకు రెక్కలు

 న్యూఢిల్లీ : కార్ల తయారీలో అగ్రగామి సంస్థ మారుతి సుజుకీ..తన వాహన ధరలను రూ.17 వేల వరకు పెంచుతున్నట్లు ప్రకటించింది. ముడి సరుకుల ధరలు పెరుగడం వల్లనే రూ.1,700 నుంచి రూ.17 వేల వరకు సవరించాల్సి వచ్చిందని కంపెనీ బీఎస్‌ఈకి సమాచారం అందించింది. పెరిగిన ధరల బుధవారం నుంచి అమలులోకి వచ్చాయని కంపెనీ వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం సంస్థ రూ.2.45 లక్షలు(ఆల్టో 800) మొదలుకొని రూ.11.29 లక్షల(ప్రీమియం ఎస్-క్రాస్) లోపు ధర కలిగిన పలు మోడళ్లను దేశీయంగా విక్రయిస్తున్నది. 

ఈ నెల 8 నుంచి అమలులోకి వచ్చేలా వాహన ధరలను రూ.6 వేల నుంచి రూ.32 వేల వరకు సవరించినట్లు మరో సంస్థ హోండా వెల్లడించింది. కానీ ఈ ధరల పెంపు నుంచి అకార్డ్ హైబ్రిడ్ మోడల్‌ను మినహాయింపునిచ్చింది. హెచ్‌సీఐఎల్ రూ.4.66 లక్షల నుంచి రూ.43.21 లక్షల లోపు విలువైన పలు మోడళ్లను విక్రయిస్తున్నది. ఇప్పటికే టాటా మోటార్స్ రూ.25 వేలు పెంచుతున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే.