మారుతీ కార్లు ప్రియం

మారుతీ కార్లు ప్రియం

  న్యూఢిల్లీ : దేశంలోనే అతిపెద్ద కార్ల తయారీదారు మారుతి సుజుకి తమ వాహన ధరలను రూ.10,000 వరకు పెంచుతున్నట్లు గురువారం ప్రకటించింది. పెంచిన ధరలు తక్షణమే అమల్లోకి వచ్చినట్లు పేర్కొంది. ముడి సరకు, విదేశీ మారకం రేటు పెరిగిన కారణంగా ధరలు పెంచాల్సి వచ్చినట్లు తెలిపింది. కాగా ఏ కార్లపై ఎంత ధరలు పెరుగుతాయనేది ఆ కంపెనీ వెల్లడించలేదు. ప్రస్తుతం మారుతీ సుజుకీ కార్ల మోడళ్లు ఆల్టో 800 నుంచి ఎస్‌ క్రాస్‌ వరకు ఉన్నాయి. ఢిల్లీ ఎక్స్‌షోరూం వద్ద వీటి ధరల శ్రేణీ రూ.2.53 లక్షల నుంచి రూ.11.45 లక్షలుగా ఉంది.