నాస్కాం ప్రెసిడెంట్‌గా దేవ్యాని ఘోష్

నాస్కాం ప్రెసిడెంట్‌గా దేవ్యాని ఘోష్

  న్యూఢిల్లీ : నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్‌వేర్ అండ్ సర్వీసెస్ కంపెనీస్(నాస్కాం) ప్రెసిడెంట్‌గా తొలిసారిగా మహిళా నియమితులయ్యారు. ఇంటెల్ దక్షిణాసియా మాజీ మేనేజింగ్ డైరెక్టర్ దేవ్యాని ఘోష్ వచ్చే ఏడాది మార్చి నుంచి నాస్కాం ప్రెసిడెంట్‌గా వ్యవహరించనున్నారు. ప్రస్తుతం ప్రెసిడెంట్‌గా వ్యవహరిస్తున్న ఆర్ చంద్రశేఖర్ వచ్చే ఏడాది మార్చిలో పదవీ విరమణ చేయనున్నారు. ప్రస్తుతం ఆమె నాస్కాం ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్, ట్రస్టీ ఆఫ్ నాస్కాం ఫౌండేషన్ సభ్యురాలుగా వ్యవహరిస్తున్నారు. ఘోష్ నాయకత్వంలో ఐటీ రంగంలో విప్లవాత్మక మార్పులు చోటు చేసుకోనున్నాయని, ముఖ్యంగా పరిశోధన, టెక్నాలజీ, నైపుణ్యత, నూతన మార్కెట్లో ప్రవేశించడం మరింత సులువుకానున్నదని నాస్కాం చైర్మన్ రామన్ రాయ్ ఆశాభావం వ్యక్తంచేశారు.