నోకియా 6, 8 ఫోన్లపై క్యాష్ బ్యాక్ ఆఫర్లు

నోకియా 6, 8 ఫోన్లపై క్యాష్ బ్యాక్ ఆఫర్లు

 హెచ్‌ఎండీ గ్లోబల్‌కు చెందిన నోకియా 6, నోకియా 8 ఫోన్లపై అమెజాన్ క్యాష్‌బ్యాక్ ఆఫర్లను అందిస్తున్నది. అమెజాన్ ప్రైమ్ యూజర్లు నోకియా 6 ఫోన్‌ను కొంటే రూ.2500 వరకు క్యాష్ బ్యాక్ లభిస్తుంది. అదే నాన్ ప్రైమ్ కస్టమర్లు అయితే రూ.1500 వరకు క్యాష్ బ్యాక్ లభిస్తుంది. ఇక ఈ ఫోన్‌ను అమెజాన్ పే వాలెట్ ద్వారా కొంటే అదనంగా మరో రూ.500 వరకు క్యాష్ బ్యాక్ లభిస్తుంది. అదేవిధంగా నోకియా 8 స్మార్ట్‌ఫోన్‌పై కూడా అమెజాన్ యూజర్లకు క్యాష్ బ్యాక్ ఆఫర్‌ను అందిస్తున్నది. అమెజాన్ పే ద్వారా నోకియా 8 ను కొన్న ప్రైమ్ మెంబర్లకు రూ.1500 వరకు క్యాష్ బ్యాక్ లభిస్తుంది. కాగా నోకియా 6 ఫోన్ ధర రూ.14,999 ఉండగా, నోకియా 8 ధర రూ.36,999 గా ఉంది.