ఎన్‌ఎస్‌ఇ కొత్త లోగో..

ఎన్‌ఎస్‌ఇ కొత్త లోగో..

  నేషనల్‌ స్టాక్‌ ఎక్సేంజీ (ఎన్‌ఎస్‌ఇ) సిల్వర్‌ జూబ్లీ ఉత్సవాల్లో భాగంగా తన కొత్త లోగోను ఆవిష్కరించింది. బుధవారం దీన్ని మాజీ ప్రధానీ మన్మోహన్‌ సింగ్‌, కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ, నీతి అయోగ్‌ వైస్‌ ఛైర్మన్‌ రాజీవ్‌ కుమార్‌ ఆవిష్కరించారు. తమ కొత్త పుష్ఫం లోగో ఆధునిక ప్రాతినిద్యానికి తోడు వృద్ధికి దోహదం చేయనుందని ఎన్‌ఎస్‌ఇ పేర్కొంది. కంపెనీలకు పెరుగుతున్న నిర్వహణ వ్యయాన్ని తగ్గించడానికి తాము ఈక్విటీ, రుణ, వడ్డీ రేట్ల భవిష్యత్తు సెగ్మెంట్ల వ్యాపార విస్తరణపై దృష్టి పెడుతున్నామని ఎన్‌ఎస్‌ఇ ఛైర్మన్‌ అశోక్‌ చావ్లా పేర్కొన్నారు.