ఓలా గూటికి రైడ్లర్‌ యాప్‌

ఓలా గూటికి రైడ్లర్‌ యాప్‌

  న్యూఢిల్లీ: టికెటింగ్, కమ్యూటింగ్‌ యాప్‌ రైడ్లర్‌ను క్యాబ్‌ అగ్రిగేటర్‌ ఓలా కొనుగోలు చేసింది. మొటిలిటీ ప్లాట్‌ఫార్మ్‌ను ప్రజారవాణా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌తో అనుసంధానించే యత్నాలకు ఈ కొనుగోలు తోడ్పాటునందిస్తుందని ఓలా తెలిపింది. రవాణా సేవలను మరింత సమర్థవంతంగా అందించడానికి రైడ్లర్‌ కొనుగోలు ఉపకరిస్తుందని ఓలా సీఈఓ భవిష్‌ అగర్వాల్‌ చెప్పారు.ఈ డీల్‌కు సంబంధించిన ఆర్థిక వివరాలు వెల్లడి కాలేదు. రైడ్లర్‌లోని 64 మంది ఉద్యోగులు ఓలాలో ఒక భాగమవుతారని, ఇక నుంచి రైడ్లర్‌ ఏఎన్‌ఐ టెక్నాలజీస్‌ పూర్తి అనుబంధ సంస్థగా కొనసాగుతుందని అగర్వాల్‌ పేర్కొన్నారు. 2012లో ముంబై కేంద్రంగా రైడ్లర్‌ కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. ఈ యాప్‌తో ప్రజా రవాణా ఆప్షన్స్‌ సెర్చి చేయడం, బుక్‌ చేయడం చేసుకోవచ్చు.