ఓలాలో సచిన్‌ బన్సల్‌ పెట్టుబడి

ఓలాలో సచిన్‌ బన్సల్‌ పెట్టుబడి

 బెంగళూరు : ఫ్లిప్‌కార్ట్‌ సహ వ్యవస్థాపకుడు సచిన్‌ బన్సల్‌ ఓలాలో రూ.650 కోట్ల పెట్టుబడులు పెట్టారు. ఒక్కో షేరు రూ.21,250 చొప్పున 70,588 జే ప్రిఫరెన్స్‌ షేర్లను కొనుగోలు చేసినట్లు బన్సల్‌ రిజిస్ట్రార్‌ ఆఫ్‌ కంపెనీస్‌కు తెలిపారు. ఫ్లిప్‌కార్టులోని తన వాటాలను వాల్‌మార్ట్‌కు విక్రయించి సంస్థ నుంచి బయటకు వచ్చాక .. ఆయన తొలి పెట్టుబడి ఇదే. బన్సల్‌ మొత్తం 100 మిలియన్‌ డాలర్లు ఓలాలో పెట్టుబడి పెట్టనున్నారని తొలుత వార్తలు వచ్చాయి. కాని తుదకు 21 మిలి యన్‌ డాలర్లు పెట్టారు. ఇప్పటి వరకు ఓలా మార్కెట్‌ విలువ 5.7 బిలియన్‌ డాల ర్లుగా అంచనా వేశారు. ఓలాలో వ్యక్తిగత రూపంలో వచ్చిన అతిపెద్ద పెట్టుబడి ఇదే. ఇప్పటికే ఓలాలో జపాన్‌కు చెందిన సాఫ్ట్‌బ్యాంక్‌ 26శాతం వాటాను కలిగి ఉంది.