ఓలాలో సచిన్‌ బన్సల్‌ 740 కోట్ల పెట్టుబడులు..!

ఓలాలో సచిన్‌ బన్సల్‌ 740 కోట్ల పెట్టుబడులు..!

  ముంబయి : క్యాబ్‌ అగ్రిగేటర్‌ ఓలాలో ఫ్లిప్‌కార్ట్‌ మాజీ సిఇఒ సచిన్‌ బన్సల్‌ 100 మిలియన్‌ డాలర్లు (రూ.740కోట్లు) పెట్టుబడి పెట్టనున్నారని సమాచారం. ఫ్లిప్‌కార్ట్‌లో తన 5.5శాతం వాటాను వాల్‌మార్ట్‌కు విక్రయించి ఆయన వైదొలిగిన విషయం తెలిసిందే. తాజాగా ఓలా ఫౌండర్స్‌ భవిష్య అగర్వాల్‌, అంకిత్‌ అగర్వాల్‌కు సన్నిహితుడైన సచిన్‌ ఓలాలో దాదాపు 10శాతం వాటాను కొనుగోలు చేయనున్నారని సమాచారం.