ఒప్పో ఫోన్ యూజర్లకు బంపర్ ఆఫర్

ఒప్పో ఫోన్ యూజర్లకు బంపర్ ఆఫర్

అక్టోబర్ నెల 27వ తేదీ తరువాత ఒప్పో ఫోన్లను కొన్న యూజర్లు కు ఒప్పో సంస్థ బంపర్ ఆఫర్ ప్రకటించింది.రిలయన్స్ జియో సంస్థతో ఒప్పో భాగస్వామ్యమై తమ ఒప్పో ఫోన్ యూజర్లకు ఉచిత 4జీ డేటాను అందిస్తున్నది.

ఇందులో భాగంగా గత ఒప్పో ఎఫ్5, ఎఫ్3, ఎఫ్3 ప్లస్, ఎఫ్1 ప్లస్ యూజర్లు జియోలో రూ.309 ఆపైన విలువ గల ప్లాన్లతో రీచార్జి చేసుకుంటే రీచార్జికి 10జీబీ 4జీ డేటా చొప్పున మొత్తం 10 సార్లు చేసే రీచార్జిలకు గాను 100 జీబీ డేటాను పొందవచ్చు.

అలాగే ఒప్పో ఎఫ్1ఎస్, ఎ33ఎఫ్, ఎ37ఎఫ్, ఎ37ఎఫ్‌డబ్ల్యూ, ఎ57, ఎ71 ఫోన్లను వాడుతున్న యూజర్లు కూడా రూ.309 ఆపైన విలువ గల ప్లాన్లతో రీచార్జి చేసుకుంటే రీచార్జికి 10జీబీ డేటా చొప్పున మొత్తం 6 సార్లు చేసే రీచార్జిలకు గాను 60 జీబీ డేటాను పొందవచ్చు.