>

పైసా జీతం వద్దంటున్న అనిల్ అంబానీ

పైసా జీతం వద్దంటున్న అనిల్ అంబానీ

న్యూఢిల్లీ: రిలయన్స్ కమ్యూనికేషన్ చైర్మన్ అనిల్ అంబానీ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికిగాను ఆయన ఎలాంటి వేతనం లేదా కమీషన్‌ను తీసుకోవడం లేదని ఆర్‌కామ్ ఒక ప్రకటనలో వెల్లడించింది. రుణాలతో సతమతమవుతున్న సంస్థను మళ్లీ గాడిలో పెట్టడానికి ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తున్నది. కంపెనీకి చెందిన ఇతర ఉన్నతాధికారులు సైతం 21 రోజుల వేతనాన్ని తీసుకోవడం లేదట.

వివిధ బ్యాంకులు, ఆర్థిక సేవల సంస్థల వద్ద తీసుకున్న రూ.45 వేల కోట్ల రుణాలను ఈ డిసెంబర్ నాటికి తిరిగి చెల్లింపులు జరుపనున్నట్లు ఇటీవల సంస్థ వెల్లడించింది. రుణాలను తగ్గించుకోవడంలో భాగంగా సెప్టెంబర్ నాటికి రెండు ఒప్పందాల ద్వారా రూ.20 వేల కోట్ల నిధులు సమకూరనున్నాయని అనిల్ అంబానీ ఇటీవల వ్యాఖ్యానించారు.


Loading...