పతంజలి నుంచి ఆర్గానిక్‌ ఉత్పత్తులు

పతంజలి నుంచి ఆర్గానిక్‌ ఉత్పత్తులు

  న్యూఢిల్లీ: ప్రముఖ యోగా గురువు బాబా రాందేవ్‌ పతంజలి పేరుతో ఆయుర్వేద ఉత్పత్తులతో పాటు త్వరలో ఆర్గానిక్‌ ఉత్పత్తులను కూడా మార్కెట్లోకి అందుబాటులోకి తేనున్నారు. దీనికి సంబంధింని పతంజలి (జార్ఖండ్‌) సంస్థ స్థానిక ప్రభుత్వంతో చేతులు కలిపింది. ఆ రాష్ట్రంలో గోధుమ, వరి, కూరగాయలను ఎక్కువగా సేంద్రియ పద్ధతుల్లో సాగు చేస్తుండటంతో ఇక్కడి ఉత్పత్తులను కొనుగోలు చేసి తమ బ్రాండ్‌ కింద మార్కెటింగ్‌ చేయాలని రాందేవ్‌ బాబా నిర్ణయించారు. ఈ విషయాన్ని 'గ్లోబల్‌ అగ్రికల్చర్‌ అండ్‌ ఫుడ్‌ సమ్మిట్‌'లో జార్ఖండ్‌ ముఖ్యమంత్రి రఘుబర్‌దాస్‌ వెల్లడించారు.రాష్ట్ర ప్రభుత్వానికి పతంజలి ఆయుర్వేద సంస్థకు మధ్య ఆర్గానిక్‌ ఉత్పత్తులకు సంబంధించి ఒక ఒప్పందం కుదిరినట్లు ఆయన చెప్పారు. 

దీని ద్వారా ఆర్గానిక్‌ సేద్యం మరింత పెరుగుతుందన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. అంతేకాకుండా 24 జిల్లాల్లో సేంద్రియ ఉత్పత్తుల కస్టర్స్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు సీఎం వెల్లడించారు. 'జార్ఖండ్‌ జైవిక్‌' పేరుతో ఈ ఉత్పత్తులను విక్రయించ నున్నట్లు తెలిపారు. అదే విధంగా పతంజలి ఆధ్వర్యంలో తేనెను ప్రాసెసింగ్‌ చేసే ప్లాంట్‌ను ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు ఒప్పందం కుది రిందన్నారు. తేనె, గోధుమలు, బియ్యం, పప్పులు, కూరగాయలు, ఇతర సేంద్రి య ఉత్పత్తులను పతంజలి కొనుగోలు చేస్తుందని బాబా రాందేవ్‌ వెల్లడించారు. వ్యవసాయంలో అగ్రగామి రాష్ట్రంలో నిలిచే సత్తా ఝార్ఖండ్‌కు ఉందని, రాష్ట్ర రైతులకు మేలు జరిగేలా పతంజలి పనిచేస్తుందని ఆయన అన్నారు.