>

పిక్సల్ 2, కొత్త ఐఫోన్లపై జియో ఆఫర్లు..!

పిక్సల్ 2, కొత్త ఐఫోన్లపై జియో ఆఫర్లు..!

 రిలయన్స్ జియో సంస్థ గూగుల్ పిక్సల్ 2, పిక్సల్ 2 ఎక్స్‌ఎల్, ఆపిల్ ఐఫోన్ 10, ఐఫోన్ 8, 8 ప్లస్ ఫోన్లను కొనుగోలు చేసే యూజర్లకు బంపర్ ఆఫర్లను అందిస్తున్నది. జియో వెబ్‌సైట్ లేదా యాప్ ద్వారా ఈ ఫోన్లను కొనుగోలు చేసిన వారికి పలు ఆఫర్లు లభిస్తున్నాయి. పిక్సల్ 2 లేదా పిక్సల్ 2 ఎక్స్‌ఎల్ ఫోన్లను కొంటే రూ.22,999 విలువైన బెనిఫిట్స్‌ను జియో అందిస్తున్నది. వారికి జియో రూ.9,999 విలువ చేసే ఏడాది ప్లాన్‌ను ఉచితంగా అందిస్తున్నది. దీని ప్రకారం యూజర్లకు ఏడాది పాటు అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్ వస్తాయి. దీంతోపాటు ఉచితంగా 750 జీబీ 4జీ డేటా లభిస్తుంది. డేటా మొత్తాన్ని వాడుకుంటే స్పీడ్ 64 కేబీపీఎస్ కు తగ్గుతుంది. ఇక ఈ ఫోన్లను హెచ్‌డీఎఫ్‌సీ క్రెడిట్ కార్డుతో కొంటే రూ.8వేల వరకు క్యాష్ బ్యాక్ లభిస్తుంది. 

 
ఇక ఆపిల్‌కు చెందిన ఐఫోన్ 10, 8, 8 ప్లస్ ఫోన్లను సిటీ బ్యాంక్ డెబిట్, క్రెడిట్ కార్డులతో కొనుగోలు చేస్తే రూ.8వేల వరకు క్యాష్ బ్యాక్ లభిస్తుంది. దీంతోపాటు యూజర్లకు 70 శాతం బై బ్యాక్ ఆఫర్ వస్తుంది. అంటే ఏడాది పాటు నెలకు రూ.799 ప్లాన్ ను రీచార్జి చేసుకుంటూ జియో సిమ్‌ను పైన ఆపిల్ ఫోన్లలో వాడితే ఏడాది తరువాత ఆ ఫోన్లను వాటి ధరలో 70 శాతం మొత్తానికి యూజర్లు అమ్ముకోవచ్చు. అయితే ఫోన్లపై ఎలాంటి గీతలు పడరాదు, ఫిజికల్ డ్యామేజ్ ఉండరాదు. యూజర్లు జియో వెబ్‌సైట్‌కు వెళ్లి అందులో బై బ్యాక్ ఆఫర్‌కు రిజిస్టర్ చేసుకుంటే తమ ఐఫోన్లలో ఆ ఆఫర్‌ను పొందవచ్చు.