ప్రయాణికుల కోసం జీతో మినీవ్యాన్

ప్రయాణికుల కోసం జీతో మినీవ్యాన్

 హైదరాబాద్: కమర్షియల్ వాహన తయారీలో అగ్రగామి సంస్థ మహీంద్రా అండ్ మహీంద్రా..పట్టణాల్లో, చిన్న స్థాయి నగరాల్లో ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చేందుకుగాను మార్కెట్లోకి జీతో మినీవ్యాన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. హైదరాబాద్‌కు సమీపంలో ఉన్న జహీరాబాద్ ప్లాంట్లో తయారైన ఈ మినీవ్యాన్ ధరను రూ.3.34 లక్షలుగా నిర్ణయించింది. బీఎస్-4 ప్రమాణాలతో రూపొందించిన ఈ వాహనం డీజిల్, పెట్రోల్, సీఎన్‌జీ వెర్షన్లలో లభించనున్నది.

లీటర్‌కు 26 కిలోమీటర్ల మైలేజీ ఇవ్వనున్నది. ఈ సందర్భంగా కంపెనీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ మాట్లాడుతూ..పరిశోధన, పనితీరు, భద్రత, సౌకర్యవంతంగా ఉండే విభాగాల్లో జీతో నూతన ఒరవడిని సృష్టించిందని, ఇదే విభాగంలో ప్రయాణికుల కోసం మినీవ్యాన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు చెప్పారు. మూడు రంగుల్లో లభించే ఈ వ్యాన్‌పై రెండేండ్లు లేదా 40 వేల కిలోమీటర్ల వరకు వారంటీ సదుపాయం కల్పించింది.