రిలయన్స్‌ జువెల్స్‌ 11వ వార్షికోత్సవం

రిలయన్స్‌ జువెల్స్‌ 11వ వార్షికోత్సవం

  హైదరాబాద్ :  దేశీయ అతిపెద్ద జువెల్లరీ బ్రాండ్‌ రిలయన్స్‌ జువెల్స్‌ తన 11వ వార్షికోత్సవాన్ని ఎంతో ఘనంగా జరుపుకుంటోంది. ఈ సందర్భంగా తన కస్టమర్లకు సరికొత్త కలెక్షన్‌ వారి ముందుకు తీసుకొచ్చింది. 'ఆభార్’’ అనే పేరుతో ఈ కలెక్షన్‌ను విడుదల చేసింది.భారత్‌లో అత్యంత ప్రముఖ ఆభరణాల బ్రాండ్లలో రిలయన్స్‌ జువెల్స్‌ కూడా ఒకటి. సహజత్యం ఉట్టిపడేలా పచ్చని చెట్లు, పూలు, ప్రకృతి దృశ్యాలను ప్రతిబింబిస్తూ రిలయన్స్‌ జువెల్స్‌ ఈ ఆభరణాలను రూపొందించింది. 

అలాగే ఈ 11వ వార్షికోత్సవం సందర్భంగా వినియోగదారులకు గుర్తుండేలా ప్రత్యేక ఆఫర్లను అందిస్తున్నట్టు రిలయన్స్ జువెల్స్‌ తెలిపింది. ఈ సందర్భంగా రిలయన్స్ జుయల్స్ సీఈఓ సునీల్ నాయక్ మాట్లాడుతూ.. గత 11 ఏళ్లుగా మాకు మద్దతుగా నిలుస్తున్న వినియోగదారులందరికీ అభినందనలు. వినియోగదారుల నమ్మకాన్ని మరింత చూరగొనేందుకు నిరంతరం ప్రయత్నిస్తుంటామని ఆయన తెలిపారు.