రెండు స్టాక్‌ఎక్స్చేంజీల నుంచి ఇన్ఫీ డీలిస్ట్‌

రెండు స్టాక్‌ఎక్స్చేంజీల నుంచి ఇన్ఫీ డీలిస్ట్‌

  ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్‌ రెండు స్టాక్‌ ఎక్స్ఛేంజీలనుంచి వైదొలగుతున్నట్టు ప్రకటించింది.  పారిస్, లండన్ స్టాక్‌మార్కెట్లలో ఇన్ఫోసిస్‌ షేర్లను డిలిస్టింగ్‌ చేస్తున్నట్టు  వెల్లడించింది.  రోజువారి సగటు ట్రేడింగ్‌  వాల్యూమ్ తక్కువగా ఉండటంతో స్వచ్చందంగా ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపింది. యూరో నెక్ట్స్‌ ప్యారిస్, యూరో నెక్ట్స్‌ లండన్ స్టాక్ ఎక్స్ఛేంజీలనుంచి తన అమెరికా డిపాజిటరీ షేర్లను (ఏడీస్‌) డీలిస్ట్‌ చేయనున్నామని  సోమవారం  ఒక ప్రకటనలో తెలిపింది. ఆయా మార్కెట్‌ రెగ్యులేటరీ ఆమోదం వచ్చేంతవరకు  క్యాపిటల్‌ స్ట్రక్చర్‌, ఏడీఎస్‌  కౌంట్‌ యథావిధిగానే కొనసాగుతుందని బీఎస్‌ఈ ఫైలింగ్‌లో   చెప్పింది.   అయిదేళ్ల క్రితం  న్యూయార్క్‌ స్టాక్‌ ఎక్సేంజ్‌లో లిస్ట్‌ షేర్‌  ట్రేడింగ్‌ వాల్యూమ్‌ అప్పటికంటే తక్కువగా ఉందని పేర్కొంది.  కాగా సోమవారం వారం నాటి దేశీయ బుల్‌ ర్యాలీలో  లాభాలతో మురిపించింది.