స్మార్ట్‌ఫోన్లపై పేటీఎం బంపర్‌ ఆఫర్లు

స్మార్ట్‌ఫోన్లపై పేటీఎం బంపర్‌ ఆఫర్లు

  కొత్త స్మార్ట్‌ఫోన్‌ కొనుగోలు చేయాలనే ఆలోచనలో ఏమైనా ఉన్నారా? అయితే ఇదే సరియైన సమయమట. డిజిటల్‌ దిగ్గజం పేటీఎం తన మాల్‌లో స్మార్ట్‌ఫోన్‌ బ్రాండ్లపై భారీ డిస్కౌంట్లను ఆఫర్‌ చేస్తోంది. డిస్కౌంట్లు ఏ విధంగా ఉన్నాయో ఓ సారి చూద్దాం..

నోకియా... నోకియా స్మార్ట్‌ఫోన్లపై పేటీఎం మాల్‌ తన ప్లాట్‌ఫామ్‌పై 21 శాతం వరకు డిస్కౌంట్లను ఆఫర్‌ చేస్తోంది. 18 శాతం వరకు క్యాష్‌బ్యాక్‌ను ఇస్తోంది.

మోటోరోలా.. మోటోరోలా హ్యాండ్‌సెట్లపై కూడా 35 శాతం వరకు డిస్కౌంట్లను పేటీఎం మాల్‌ అందిస్తోంది. డిస్కౌంట్‌తో పాటు క్యాష్‌బ్యాక్‌ను కూడా ఇది ఆఫర్‌ చేస్తోంది. క్యాష్‌బ్యాక్‌ మొత్తం డివైజ్‌ను బట్టి ఉంది.

ఒప్పో... 5 శాతం ఫ్లాట్‌ క్యాష్‌బ్యాక్‌తో ఒప్పో స్మార్ట్‌ఫోన్లు, పేటీఎం మాల్‌లో అందుబాటులోకి వచ్చాయి. ఒప్పో ఏ57 స్మార్ట్‌ఫోన్‌పై గరిష్టంగా 25 శాతం డిస్కౌంట్‌ను అందిస్తోంది. అంతేకాక 1,199 రూపాయల క్యాష్‌బ్యాక్‌ను ఇస్తోంది. క్యాష్‌బ్యాక్‌, డిస్కౌంట్‌ అనంతరం ఒప్పో ఏ57 స్మార్ట్‌ఫోన్‌ 10,791 రూపాయలకు అందుబాటులోకి వచ్చింది.

వివో... ఒప్పో మాదిరిగా వివో హ్యాండ్‌సెట్లు కూడా ఫ్లాట్‌ 5 శాతం క్యాష్‌బ్యాక్‌ ఆఫర్‌ను కలిగి ఉన్నాయి. అన్ని చైనీస్‌ హ్యాండ్‌సెట్లతో పోల్చుకుంటే, వివో వీ5ఎస్‌ స్మార్ట్‌ఫోనే గరిష్టంగా 31 శాతం డిస్కౌంట్‌తో అందుబాటులోకి వచ్చింది. దీంతో పాటు ఈ స్మార్ట్‌ఫోన్‌పై 655 రూపాయల క్యాష్‌బ్యాక్‌ కూడా ఈ ఫోన్‌పై లభిస్తోంది. దీంతో మొత్తంగా రూ.12,444కు వివో వీ5ఎస్‌ను పేటీఎం మాల్‌ విక్రయిస్తోంది. 

ఆపిల్‌, గూగుల్‌, శాంసంగ్‌, హానర్‌, లెనోవో స్మార్ట్‌ఫోన్‌ బ్రాండ్లపై కూడా పేటీఎం మాల్‌ డిస్కౌంట్లను, క్యాష్‌బ్యాక్‌లను అందిస్తోంది. ఆపిల్‌ ఐఫోన్లపై 9 వేల రూపాయల వరకు క్యాష్‌బ్యాక్‌, శాంసంగ్‌ గెలాక్సీ స్మార్ట్‌ఫోన్‌పై 8వేల రూపాయల వరకు క్యాష్‌బ్యాక్‌, గూగుల్‌ పిక్సెల్‌ డివైజ్‌లపై కనీసం 6 వేల రూపాయల క్యాష్‌బ్యాక్‌ లభిస్తోంది.