త్వరలో కొత్త ఐఫోన్‌ మోడల్స్‌..!

త్వరలో కొత్త ఐఫోన్‌ మోడల్స్‌..!

  వాషింగ్టన్‌ : ఎలక్ట్రానిక్‌ ఉత్పత్తుల సంస్థ ఆపిల్‌ ప్రస్తుత ఏడాదిలో మూడు కొత్త ఐఫోన్లను ఆవిష్కరించనుందని వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌ ఓ నివేదికలో వెల్లడించింది. కొత్తగా విడుదలయ్యే మోడల్స్‌లో ఐఫోన్‌ ఎక్స్‌ఆర్‌ మోడల్‌కు తర్వాతి వర్షెన్‌ కూడా ఉండనున్నట్లు తెలిపింది. అలాగే కొత్త మోడల్‌ ఫోన్లలో సరికొత్త కెమెరా ఫీచర్లను కూడా చేర్చనున్నట్లు పేర్కొంది. దీనిపై ఆపిల్‌ అధికారికంగా స్పందించలేదు. చైనాలో ఐఫోన్లకు డిమాండ్‌ తగ్గడంతో ఇటీవల యాపిల్‌ షేర్లు అత్యధికంగా పది శాతం పడిపోయాయి.