వండర్‌లాలో సరికొత్త రైడ్

వండర్‌లాలో సరికొత్త రైడ్

  హైదరాబాద్: దేశంలో అతిపెద్ద అమ్యూజ్‌మెంట్ పార్క్ నిర్వహణ సంస్థ వండర్‌లా.. హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన పార్క్‌లో మరో నూతన రైడ్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. అంతరిక్షయాణంలో ఎగిరే అనుభూతిని కస్టమర్లకు కల్పించాలనే ఉద్దేశంతో దేశంలో తొలిసారిగా మిషన్ ఇంటర్‌స్టెల్లర్‌ను ఏర్పాటు చేసినట్లు కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ అరుణ్ కే చిట్టిలపల్లి తెలిపారు. అమెరికా, యూరప్‌కు చెందిన థీమ్ పార్క్ డిజైనింగ్ కంపెనీలతో కలిసి రూపొందించిన ఈ రైడ్ కోసం రూ.40 కోట్ల నిధులను వెచ్చించినట్లు ఆయన చెప్పారు. దీంతో ఇప్పటి వరకు హైదరాబాద్ పార్క్‌కోసం రూ.300 కోట్ల మేర ఖర్చు చేసినట్లు అయిందన్నారు. బుధవారం ప్రముఖ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ ఈ రైడ్‌ను ప్రారంభించనున్నది. గతేడాది హైదరాబాద్ పార్క్‌ను 6.5 లక్షల మంది సందర్శించగా, ఈ ఏడాది 7.25 లక్షలకు చేరుకునే అవకాశం ఉందన్నారు. జీఎస్టీలో 28 శాతం పన్ను పరిధిలోకి ఎంటర్‌టైన్‌మెంట్ రంగాన్ని తేవడంపై ఆయన అసంతృప్తిని వ్యక్తంచేశారు. దీనిని 18 శాతానికి తగ్గించాలని ఆయన కేంద్రానికి సూచించారు