>

పెట్రోల్ బంకుల వ‌ద్ద కార్డులు చెల్లుతాయి..

పెట్రోల్ బంకుల వ‌ద్ద కార్డులు చెల్లుతాయి..

న్యూఢిల్లీ: పెట్రోల్ బంకుల వ‌ద్ద కార్డుతో జ‌రిగే లావాదేవీల‌పై ప‌న్ను ఉండ‌ద‌ని సోమ‌వారం కేంద్రం స్ప‌ష్టం చేసింది.కార్డుతో లావాదేవీలు నిర్వ‌హిస్తే, పెట్రోల్ పంపుల నుంచి అద‌న‌పు రుసుము రాబ‌ట్టేందుకు బ్యాంకులు ప్ర‌య‌త్నించాయి. దాంతో పెట్రోల్ బంకుల‌ ఓన‌ర్లు కార్డులు స్వీక‌రించేందుకు నికారించిన విష‌యం విధిత‌మే.అయితే ఈ నేప‌ధ్యంలో కేంద్రం దీనిమీద స్ప‌ష్టం చేసింది.డిజిట‌ల్ లావాదేవీలు నిర్వ‌హించే క‌స్ట‌మ‌ర్ల‌కు అద‌న‌పు ప‌న్ను ఉండ‌ద‌ని కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధ‌ర్మేంద్ర ప్ర‌ధాన్ తెలిపారు. రిటేల్ పెట్రోల్ కంపెనీల మీద కూడా ఎటువంటి భారం ఉండ‌ద‌న్నారు. కార్డు పేమెంట్‌పై వాస్త‌వానికి బ్యాంకులు ప‌న్ను వసూల్ చేస్తాయి. అయితే ఇంధ‌న కంపెనీలు, బ్యాంకులు ఈ స‌మ‌స్య‌పై త్వ‌ర‌లో ఓ నిర్ణ‌యం తీసుకుంటాయ‌ని మంత్రి తెలిపారు.


Loading...