అదరగొట్టిన కోహ్లీ.. మొదటిరోజు స్కోరు 302/4

అదరగొట్టిన కోహ్లీ.. మొదటిరోజు స్కోరు 302/4

అదరగొట్టిన కోహ్లీ.. మొదటిరోజు స్కోరు 302/4.

ఆంటిగ్వా: భారత్‌ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ శతకంతో అదరగొట్టాడు. తొలిరోజు టెస్ట్‌ మ్యాచ్‌ ముగిసే సమయానికి కోహ్లీ 197 బంతుల్లో 16 ఫోర్లు 143 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. దీంతో వెస్టిండీస్‌తో గురువారం ప్రారంభమైన తొలి టెస్టులో భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 90 ఓవర్లలో 4 వికెట్లకు 302 పరుగులు చేసింది. గత టెస్ట్‌ ఇన్నింగ్స్‌లలో ధీటైన ఆటను ప్రదర్శించిన కోహ్లీ తన 73 ఇన్నింగ్స్‌లలో 3 వేల పరుగులతో తన వ్యక్తిగత మైలురాయిని చేరుకున్నాడు. దాంతో విండీస్‌ ఇన్నింగ్స్‌ శతకాలు సాధించిన భారత కెప్టెన్‌లలో మూడో స్థానంలో విరాట్‌ కోహ్లీ నిలిచాడు. 1982-83లో స్పెయిన్‌లో భారత మాజీ కెప్టెన్‌ కపిల్‌దేవ్‌ (100) పరుగులు చేయగా, 2006లో రాహుల్‌ ద్రావిడ్‌ 146 పరుగులు చేశాడు.
బ్యాటింగ్‌కు ఇబ్బందిగా ఉన్న పరిస్థితుల్లో భారత ఓపెనర్ శిఖర్ ధావన్ తనలోని నైపుణ్యాన్ని చూపెట్టాడు. టాపార్డర్‌లో మిగిలిన ఇద్దరు సహచరులు విఫలమైనా... ఒంటరిగా పోరాటం చేస్తూ (147 బంతుల్లో 84 బ్యాటింగ్; 9 ఫోర్లు; 1 సిక్స్‌) చెలరేగాడు. అంతలో బౌలర్‌ బిషూ విసిరిన బంతితో 179 పరుగుల వద్ద ధావన్‌ చేతులేత్తేశాడు.టాస్ గెలిచి కోహ్లి బ్యాటింగ్ తీసుకోగా... భారత్ ఆరంభంలో పరుగులు చేయడంలో తీవ్రంగా ఇబ్బందులుపడింది. విండీస్ పేసర్లు షార్ట్ బంతులతో ధావన్, విజయ్ (7)లపై దాడి చేశారు. ముఖ్యంగా హోల్డర్, గాబ్రియెల్ పేస్‌తో ధావన్‌ను లక్ష్యంగా చేసుకుని ఎదురుదాడికి దిగారు. దీంతో రెండు, మూడుసార్లు బంతి ఎడ్జ్ తీసుకున్నా ఫీల్డర్ల చేతుల్లో వెళ్లకపోవడంతో ధావన్ ఊపిరి పీల్చుకున్నాడు. ఇక రెండో ఎండ్‌లో విజయ్ వీలైనన్నీ బంతులను వదిలేస్తూ క్రీజులో కుదురుకోవడానికి ప్రయత్నించాడు. కానీ తన ప్రణాళికలను పక్కగా అమలు చేసిన గాబ్రియెల్ ఏడో ఓవర్‌లో అద్భుతమైన బౌన్సర్‌తో విజయ్‌ను బోల్తా కొట్టించాడు. దీంతో భారత్ 14 పరుగుల వద్ద తొలి వికెట్‌ను చేజార్చుకుంది. తర్వాత క్రీజులోకి వచ్చిన పుజారా (16) ఏమాత్రం ఇబ్బంది లేకుండా ఆడాడు. 12వ ఓవర్‌లో కొత్త కుర్రాడు చేజ్.. ఆఫ్ బ్రేక్‌తో నిలువరించే ప్రయత్నం చేసి విఫలమయ్యాడు.ఈ ఇద్దరి సమన్వయంతో భారత్ 24వ ఓవర్‌లో 50 పరుగులకు చేరుకుంది. లంచ్ వరకు ఈ ఇద్దరు 118 బంతుల్లో రెండో వికెట్‌కు 50 పరుగులు జోడించారు. లంచ్ తర్వాత భారత్‌కు ఊహించని దెబ్బ తగిలింది. నాలుగో బంతికే బిషూ విసిరిన షార్ట్ బంతి పుజారా బ్యాట్‌ను తాకుతూ బ్రాత్‌వైట్ చేతిలోకి వెళ్లింది. దీంతో రెండో వికెట్‌కు 60 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. తర్వాత కోహ్లి.. ధావన్ నిలకడగా ఆడారు. వికెట్ స్వభావం దృష్ట్యా భారత్ ముగ్గురు పేసర్లు, ఇద్దరు స్పిన్నర్లతో బరిలోకి దిగింది. దీంతో జడేజా బెంచ్‌కు పరిమితమయ్యాడు.