ఐదు వికెట్ల తేడాతో పాకిస్తాన్‌ గెలుపు

ఐదు వికెట్ల తేడాతో పాకిస్తాన్‌ గెలుపు

 పోర్ట్‌ ఎలిజిబెత్‌: దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి వన్డేలో పాకిస్తాన్‌ ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది. టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌కు దిగిన దక్షిణిఫ్రికా రెండు వికెట్లు కోల్పోయి నిర్ణిత 50 ఓవర్లలో 266 పరుగులు చేసింది.వెటరన్‌ ఓపెనర్‌ హషీమ్‌ ఆమ్లా 108 పరుగులతో తనదైన ఇన్నింగ్స్‌ ఆడాడు. ఇతనికి తోడు ఆరంగేట్ర ఆటగాడు వాన్‌డెర్‌ డసెన్‌(93)తో మెరవడంతో 266 పరుగులు లక్ష్యాన్ని పాకిస్తాన్‌ ముందుంచింది. అనంతరం 267 పరుగుల విజయలక్ష్యంతో దిగిన పాకిస్తాన్‌ జట్టులో బ్యాట్స్‌మ్యాన్‌లు హిమామ్‌ హుల్‌ హక్‌(86) మహ్మద్‌ హఫీజ్‌(71) అర్ధసెంచరీలతో రాణించారు. ఐదు వికెట్లు కోల్పోయిన పాకిస్తాన్‌ 49.1 ఓవర్లలో విజయం సాధించింది. ఓలివర్‌, తాహిర్‌ తమ బంతులతో రాణించినా పాకిస్తాన్‌ గెలుపును ఆపలేకపోయారు.