అలెన్ డొనాల్డ్‌ రికార్డును అధిగమించిన అశ్విన్‌

అలెన్ డొనాల్డ్‌ రికార్డును అధిగమించిన అశ్విన్‌

  రాజ్‌కోట్: టీమ్‌ఇండియా ప్రధాన బౌలర్ రవిచంద్రన్ అశ్విన్ కెరీర్‌లో మరో అరుదైన ఘనత సాధించాడు. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు ఎన్నోసార్లు తన స్పిన్ మాయాజాలంతో ప్రత్యర్థిని కట్టడిచేసి భారత్‌ను ఆదుకున్నాడు. తాజాగా రాజ్‌కోట్ వేదికగా వెస్టిండీస్‌తో మ్యాచ్‌లోను మెరుగైన ప్రదర్శన చేశాడు. టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన జాబితాలో టాప్‌లో కొనసాగుతున్న సౌతాఫ్రికా ఫాస్ట్‌బౌలర్ అలెన్ డొనాల్డ్‌ను అశ్విన్ అధిగమించాడు. టెస్టు మ్యాచ్ ఆరంభానికి ముందు అశ్విన్ ఖాతాలో 327 వికెట్లు ఉన్నాయి. విండీస్‌తో టెస్టులో తొలి ఇన్నింగ్స్‌లో నాలుగు, రెండో ఇన్నింగ్స్‌లో ఒక వికెట్ తీయడంతో అతని వికెట్ల సంఖ్య 332*(63మ్యాచ్‌లు)కు చేరింది. అలెన్ తన కెరీర్‌లో 72 టెస్టు మ్యాచ్‌ల్లో 330 వికెట్లు తీశాడు. అందులో 20 ఐదు వికెట్ల ప్రదర్శన.. 3 పది వికెట్ల ప్రదర్శన ఉండటం విశేషం.

 

అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్లు..

అనిల్ కుంబ్లే-619 వికెట్లు
కపిల్ దేవ్-434 వికెట్లు
హర్భజన్‌సింగ్-417 వికెట్లు
అశ్విన్-332* వికెట్లు