‘అప్పుడది భారత్‌కు గడ్డుకాలం’

‘అప్పుడది భారత్‌కు గడ్డుకాలం’

 ముంబై: సరిగ్గా పదేండ్ల క్రితం ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ గ్రెగ్ చాపెల్ కోచింగ్‌లో నాటి టీమ్‌ఇండియా అనేక చేదు అనుభవాలను ఎదుర్కొన్నదని సచిన్ టెండూల్కర్ అన్నాడు. ఆ సమయంలో జట్టు ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి మాస్టర్ మాట్లాడాడు. 2006-07 భారత క్రికెట్‌లో గడ్డుకాలం. వెస్టిండీస్‌లో జరిగిన 2007 ప్రపంచకప్‌లో కనీసం సూపర్-8 దశకు అర్హత సాధించలేకపోయాం. వరల్డ్‌కప్ కోసం జట్టులో భారీ స్థాయిలో మార్పులు, చేర్పులు చేశాం. తప్పా, ఒప్పా అన్నదాని గురించి ఆలోచించలేదు. ఇదంతా రాత్రికి రాత్రి జరిగింది కాదు. ఈ క్రమంలోనే ప్రపంచకప్‌ను ముద్దాడటానికి నాకు 21 ఏండ్ల సమయం పట్టింది అని సచిన్ అన్నాడు. ద్రవిడ్ కెప్టెన్సీలోని భారత్.. 2007 ప్రపంచకప్‌లో బంగ్లాదేశ్, శ్రీలంకపై ఓటములతో లీగ్ దశలోనే నిష్క్రమించిన సంగతి తెలిసిందే.