ఆసిస్  టి20 సిరీస్‌  జ‌ట్టు ఇదే..

ఆసిస్  టి20 సిరీస్‌  జ‌ట్టు ఇదే..

  మెల్‌బోర్న్: ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు సొంతగడ్డపై భారత్ తో జరగబోయే టి20 సిరీస్‌కు 13 మంది సభ్యులతో కూడిన జ‌ట్టును ప్రకటించింది. ఈ టి20 జట్టులో మార్కస్ స్టాయినిస్, జేసన్ బెహ్రెండార్ఫ్‌లకు చోటు కల్పించారు. ఇక స్టార్ పేస్ బౌలర్ మిచెల్ స్టార్క్‌, స్పిన్నర్ నేథన్ లయన్, ఆల్‌రౌండర్ మిచెల్ మార్ష్‌లకు జ‌ట్టులో చోటు కల్పించలేదు. వీళ్లు ఇండియా, శ్రీలంకలతో జరగబోయే టెస్ట్ సిరీస్‌లకు సిద్ధమవుతారని కోచ్ జస్టిన్ లాంగర్ తెలిపాడు. వరల్డ్‌కప్‌కు ముందు ఆస్ట్రేలియా సొంతగడ్డపై కొన్ని కీలకమైన సిరీస్‌లు ఆడబోతున్నది. దీంతో బెస్ట్ టి20 టీమ్‌ను ఎంపిక చేయడంతోపాటు కీలకమైన ఆటగాళ్లను ఆ సిరీస్‌లకు సిద్ధం చేసే ఉద్దేశంతో ఉన్నామని లాంగర్ తెలిపాడు.

ఆస్ట్రేలియా టి20 జట్టు: ఆరోన్ ఫించ్ (కెప్టెన్), అలెక్స్ కేరీ, ఆష్టన్ అగర్, జేసన్ బెహ్రండార్ఫ్, నేథన్ కౌల్టర్ నైల్, క్రిస్ లిన్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, బెన్ మెక్‌డెర్మాట్, డార్సీ షార్ట్, బిల్లీ స్టాన్‌లేక్, మార్కస్ స్టాయినిస్, ఆండ్రూ టై, ఆడమ్ జంపా