బాలికల హక్కులను కాపాడుదాం: సచిన్

బాలికల హక్కులను కాపాడుదాం: సచిన్

 న్యూఢిల్లీ: సమాజంలో బాలికల హక్కులను కాపాడేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని సచిన్ టెండూల్కర్ పిలుపునిచ్చాడు. భారత్‌లో వివక్షను పారద్రోలేందుకు ఇదే సరైనసమయమన్నాడు. కలలను సాకారం చేసుకునేందుకు అ మ్మాయిలకు సరైన అవకాశాలు కల్పించాలన్న మాస్టర్.. ప్రతి ఆడపిల్లకు కుటుంబసభ్యుల ప్రో త్సాహం, తోడ్పాటు ఉండాలన్నాడు. అంతర్జాతీయ బాలికా దినోత్సవాన్ని పురస్కరించుకుని, యూనిసెఫ్ గుడ్‌విల్ అంబాసిడర్ హోదాలో సచిన్ మీడియాతో మాట్లాడాడు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న భారత మహిళల జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్ కూడా సచిన్ వ్యాఖ్యలతో ఏకీభవించింది. సమాజంలో అమ్మాయిని చిన్నచూపు చూడకూడదని విజ్ఞప్తి చేసింది.