బిసిసిఐ సెలక్టర్లకు  20 లక్షల నజరానా

బిసిసిఐ సెలక్టర్లకు  20 లక్షల నజరానా

 ముంబయి : ఆస్ట్రేలియా పర్యటనలో విజయ దుందుభి మోగించిన టీమిండియా జట్టును ఎంపిక చేసిన సెలక్టర్లకు భారత క్రికెట్‌ నియంత్రణ మండలి(బిసిసిఐ) నగదు నజరానా ప్రకటించింది. సీనియర్‌ సెలక్షన్‌ కమిటీలోని ఐదుగురు సభ్యులకు తలో రూ.20 లక్షల బోనస్‌ ఇవ్వనుంది. ప్రస్తుతం ఈ కమిటీకి ఎమ్మెస్కే ప్రసాద్‌ నేతృత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఆయనతో పాటు దేవాంగ్‌ గాంధీ, జతిన్‌ పరాంజ్‌పె, గగన్‌ ఖోడా, శరణ్‌దీప్‌ సింగ్‌ కమిటీలో ఉన్నారు. టెస్ట్‌, వన్డే సిరీస్‌లు గెల్చిన టీమిండియా ఆటగాళ్లకు, సహాయక సిబ్బందికి బిసిసిఐ ఇంతకుముందే భారీ నజరానా ప్రకటించిన సంగతి తెలిసిందే.