భారత మహిళల జట్టుకు షాక్

భారత మహిళల జట్టుకు షాక్

  పోచెఫ్‌స్ట్రూమ్: సౌతాఫ్రికా ఉమెన్స్ జట్టుతో టీ20 సిరీస్‌కు ముందు భారత మహిళల జట్టుకు ఎదురుదెబ్బ తగిలింది. సీనియర్ పేసర్ జులన్ గోస్వామి కాలి గాయం కారణంగా సిరీస్‌కు దూరమవుతున్నట్లు బీసీసీఐ మంగళవారం వెల్లడించింది. సౌతాఫ్రికాతో మూడో వన్డేలో గాయం కారణంగానే ఆమె విశ్రాంతి తీసుకుంది. ఆ మ్యాచ్‌లో ఆతిథ్య సఫారీ జట్టు గెలుపొందిన విషయం తెలిసిందే. గోస్వామి కాలి గాయంతో తీవ్రంగా ఇబ్బందిపడుతోంది. ఈ నేపథ్యంలో సోమవారం ఆమెకు ఎమ్‌ఆర్‌ఐ స్కానింగ్ చేయించాం. కొన్ని వారాల పాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారని బీసీసీఐ ట్విటర్‌లో పేర్కొంది. తొలి రెండు వన్డేల్లో జులన్ ఐదు వికెట్లతో విజృంభించి ఉమెన్స్ క్రికెట్లో తొలిసారి వన్డేల్లో 200వికెట్లు తీసిన మహిళా క్రికెటర్‌గా రికార్డు సృష్టించింది. ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో మంగళవారం ఇరు జట్ల మధ్య తొలి టీ20 మ్యాచ్ జరగనుంది.