ఘనంగా ప్రారంభమైన ఐపీఎల్ 11వ సీజన్

ఘనంగా ప్రారంభమైన ఐపీఎల్ 11వ సీజన్

  ముంబై: ఐపీఎల్ ప్రస్థానం దిగ్విజయంగా కొనసాగుతున్నది. పదేండ్లు గడిచినా ఇప్పటికీ అభిమానులకు కొత్త మామిడికాయ పచ్చడి లాగా ఊరిస్తూనే ఉన్నది. ఎంతో మంది దిగ్గజ క్రికెటర్ల ఆటతో పునీతమైన ఐపీఎల్..మరెంతో మంది యువ ఆటగాళ్ల భవిష్యత్తుకు బంగారు బాటలు వేసింది. దీంతో మరో సీజన్‌కు తెర తీసింది. ముచ్చటగా మూడు గంటల్లో మ్యాచ్‌ను తనవి తీరా ఆస్వాదించేందుకు అభిమాన లోకం సిద్ధమయింది. వాంఖడే స్టేడియంలో ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ తొలి పోరుతో ఐపీఎల్ 11వ సీజన్ ప్రారంభమైంది. సినిమా తారలు నృత్యాలతో ఐపీఎల్ 11 కు స్వాగతం పలకగా.. చీర్ గర్ల్స్ చీర్స్ అంటూ ఐపీఎల్‌కు వెల్‌కమ్ చెప్పారు. సినిమా తారల్లో తమన్నా, ప్రభుదేవా, హృతిక్ రోషన్, జాక్వెలిన్ ఫెర్నాండెస్, వరుణ్ దావన్ తమ డ్యాన్స్‌తో ఐపీఎల్ అభిమానులను ఉర్రూతలూగించారు.