>

 హాకీ ప్లేయ‌ర్స్‌.. న‌ల్లరిబ్బ‌న్ల‌తో నిర‌స‌న‌

 హాకీ ప్లేయ‌ర్స్‌.. న‌ల్లరిబ్బ‌న్ల‌తో నిర‌స‌న‌

 న్యూఢిల్లీ: క‌్రికెట్‌లో పాకిస్థాన్ చేతిలో ఓడిపోయి కోట్లాది మంది ఫ్యాన్స్‌ను టీమిండియా నిరాశ ప‌రిచింది. కానీ అదే స‌మ‌యంలో అదే ఇంగ్లండ్ గ‌డ్డ‌పై పాక్‌ను చిత్తుగా ఓడించింది ఇండియ‌న్ హాకీ టీమ్‌. హాకీ వ‌ర‌ల్డ్ లీగ్ సెమీస్ టోర్నీలో పాక్‌ను 7-1తో మ‌ట్టిక‌రిపించింది. అయితే ఈ విజ‌య‌మే కాదు.. ఈ మ్యాచ్ సంద‌ర్భంగా ఇండియ‌న్ ప్లేయ‌ర్స్ చేసిన ఓ ప‌ని కూడా ప్ర‌శంస‌నీయంగా మారింది. 

మ్యాచ్‌కు న‌ల్ల రిబ్బ‌న్లు ధ‌రించి బ‌రిలోకి దిగారు ఇండియ‌న్ ప్లేయ‌ర్స్‌. ఎందుకో తెలుసా.. స‌రిహ‌ద్దులో మ‌న సైనికుల‌పై పాకిస్థాన్ దాడుల‌కు నిర‌స‌న‌గా. ఆట ద్వారా త‌మ నిర‌స‌న‌ను తెల‌పాల‌న్న ఉద్దేశంతోనే ఇలా చేసిన‌ట్లు కెప్టెన్ హ‌ర్మ‌న్‌ప్రీత్ సింగ్ చెప్పాడు. ఆట ద్వారా ప్ర‌పంచానికి మా సందేశం ఇవ్వ‌డానికి క‌చ్చితంగా గెల‌వాల‌నే బ‌రిలోకి దిగామ‌ని అత‌ను అన్నాడు. అన్న‌ట్లుగానే హ‌ర్మ‌న్‌ప్రీత్ మ్యాచ్‌లోనూ రాణించాడు. ఇండియా సాధించిన ఏడు గోల్స్‌లో అత‌నివి రెండు ఉన్నాయి.


Loading...