ఐసీసీపై డుప్లెసిస్‌ ఆగ్రహం

ఐసీసీపై డుప్లెసిస్‌ ఆగ్రహం

  క్రికెటర్ల ప్రవర్తనకు సంబంధించి ఐసీసీ విధించే డీమెరిట్‌ పాయింట్లపై దక్షిణాఫ్రికా సారథి డుప్లెసిస్‌ తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు. అందరినీ సమాన దృష్టితో చూడాల్సిన ఐసీసీ పక్షపాత ధోరణితో వ్యవహరిస్తుందని ఈ సందర్భంగా మండిపడ్డాడు. ఇందుకు ఆసీస్‌ ఆటగాడు డేవిడ్‌ వార్నర్‌, తమ దేశ పేసర్‌ రబాడలపై చర్యల కారణాన్ని డుప్లెసిస్‌ విమర్శించాడు. వీరి విషయంలో సమ న్యాయం జరగలేదని ధ్వజమెత్తాడు. ఆస్ట్రేలియాకు చెందిన డేవిడ్‌ వార్నర్‌ తొలి టెస్ట్‌లో డికాక్‌ను ఉద్దేశపూర్వకంగా దూషించినప్పుడు మాత్రం లెవల్‌ 2 కింద మూడు డీమెరిట్‌ పాయింట్లు ఇచ్చారు. 

రెండో టెస్ట్‌లో రబడా అనుకోకుండా ఆసీస్‌ సారథి స్టీవ్‌ స్మిత్‌ భుజాన్ని తాకటంతో లెవల్‌-2 కింద నాలుగు డీమెరిట్‌ పాయింట్లు ఇవ్వడమే కాకుండా.. మ్యాచ్‌ ఫీజులో 65 శాతం కోత విధించింది. రబాడకు కూడా మూడు డీమెరిట్‌ పాయింట్లు ఇచ్చి ఉంటే ఆస్ట్రేలియాతో జరిగే మిగతా టెస్టులు ఆడే వాడని కానీ ఐసీసీ తమకు వ్యతిరేకంగా ప్రవర్తించిందని ఐసీసీని దక్షిణాఫ్రికా సారథి ఈ సందర్భంగా విమర్శించాడు. ఇక రబడా విషయంపై ఐసీసీకి వ్యతిరేకంగా అప్పీల్‌కు వెళ్లినా లాభం ఉండదనే ఉద్దేశంతో ముందుకు వెళ్ళడంలేదని డుప్లెసిస్‌ ఆవేదన వ్యక్తం చేశాడు.